: ప్రాణాంతక ఎబోలా సోకిందా? లేదా? అనేది ఇక నిమిషాల్లోనే తేలిపోనుంది

ఆఫ్రికా ఖండంలోని పశ్చిమ దేశాల్లో పుట్టి, ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ కు సంబంధించి శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రాణాంతకమైన ఆ వ్యాధి సోకిందా? లేదా? అనే విషయాన్ని ఇకపై నిమిషాల్లోనే నిర్ధారించవచ్చు. దీనికోసం ఆర్ఈఈబీఓవీ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్, కార్జెనిక్ అనే పరీక్ష నిర్వహించామని... గతంలో కన్నా వేగంగా దీంతో ఎబోలాను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా ఎబోలా వైరస్ సోకిన వారికి ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ (ఆర్ డీటీ) నిర్వహించి వ్యాధిని నిర్ధారించేవారు. ఈ పరీక్ష చాలా ప్రయాసతో కూడుకున్నదే కాక, ఎన్నో గంటల సమయాన్ని కూడా తీసుకుంటుంది. తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన విధానంతో వ్యాధి నిర్ధారణ సులువుగా మారింది.

More Telugu News