: సెకనుకు 10 జీబీ స్పీడ్ తో యూఎస్ బీ టైప్-సి కనెక్టరుకు సపోర్టిచ్చే తొలి స్మార్ట్ ఫోన్

త్వరలో తాము విడుదల చేసే స్మార్ట్ ఫోన్లో యూఎస్ బీ టైప్-సీ కనెక్టరును వాడుకోవచ్చని, ఈ తరహా 'రివర్సిబుల్' సౌకర్యంతో విడుదల కానున్న తొలి ఫోన్ ఇదేనని 'వన్ ప్లస్' ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ గూగుల్ ప్లస్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ప్రకటన విడుదల చేసింది. తదుపరి తరం యూఎస్ బీగా ప్రపంచం ముందుకు వచ్చిన టైప్-సీ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా సెకనుకు 10 గిగాబైట్ల (జీబీ) వేగంతో డేటాను బట్వాడా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. దీన్ని వాడటం ద్వారా మరింత వేగంగా ఫోన్ ను చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ప్రస్తుతం యాపిల్ మార్కెటింగ్ చేస్తున్న 12 అంగుళాల మ్యాక్ బుక్ లో టైప్-సి కన్వర్టర్ సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో లీటీవీ అనే సంస్థ ఓ స్మార్ట్ ఫోన్ ను ఇదే సౌకర్యంతో విడుదల చేసినప్పటికీ, ఆ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.

More Telugu News