: ఆ న్యూడుల్స్ ను తాడులా పేరిస్తే...!

భారతీయ విపణిలో నిషేధం ఎదుర్కొంటున్న నెస్లే కంపెనీ తయారు చేసిన నూడుల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నెస్లే వెనక్కి రప్పించుకుంటున్న ఒక్కో ప్యాకెట్ ను ఉడికించి, అందులోని న్యూడుల్స్ ను ఒకదాని చివర ఒకటిగా పేర్చి తాడులా చేస్తే అది 65 అడుగుల పొడవు అవుతుందట. ఈ లెక్కన వెనక్కి వచ్చిన మొత్తం ప్యాకెట్లలో నూడిల్స్ ను ఉడికించి, తాడులా ఒకదాని తరువాత మరొకటి పేరిస్తే, వాటితో భూమిని 200 సార్లు కట్టేయొచ్చు. లేదా, చంద్రుడి దగ్గరకు పదిసార్లు వెళ్లివచ్చేయొచ్చు. ఎందుకంటే, ఇవి 50 లక్షల మైళ్ల (80లక్షల 40వేల కిలోమీటర్లు) పొడవు వస్తాయి. భారత విపణిలో 27 వేల టన్నుల బరువు కలిగిన, 40 కోట్ల మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని వెనక్కి తేవడానికి నెస్లే కంపెనీ 2,500 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ మొత్తం ప్యాకెట్లను నిర్వీర్యం చేయాలంటే 40 రోజులు పడుతుంది. నెస్లే లెక్కల ప్రకారం ఈ నూడుల్స్ ప్యాకెట్లలో ఉన్న క్యాలరీలు అరిగించుకోవాలంటే సాధారణ జీర్ణ వ్యవస్థ ఉన్న వ్యక్తి 30 ఏళ్ల పాటు ట్రెడ్ మిల్ పై నడవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News