: భార్య గుండెను బద్దలు చేస్తే... భర్త జ్ఞాపకాలను ముక్కలు చేశాడు!

ప్రేమ, ద్వేషం పరస్పర విరుద్ధ భావాలు. ఈ రెండింటినీ ఎవరికి తోచిన పధ్ధతిలో వారు వ్యక్తం చేస్తుంటారు. జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన నుంచి వేరుపడిన భార్యపై అక్కసును విచిత్రంగా వెళ్లగక్కాడు. తన గుండె బద్దలు చేసిన మాజీ భార్యకు, తామిద్దరూ జీవితం పంచుకున్నప్పుడు వినియోగించిన ప్రతి వస్తువును రెండు ముక్కలు చేసి, ఒక భాగం పార్శిల్ చేసి పంపాడు. కారు, టీవీ, సీడీ, ల్యాప్ ట్యాప్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, కుర్చీలు, సోఫా, బెడ్, చివరికి టెడ్డీబేర్ బొమ్మను కూడా రెండు ముక్కలు చేసి, మాజీ భార్య వాటా ఆమెకు పంపాడు. తనకు సంబంధించిన ప్రతి భాగాన్ని చౌకగా ఆన్ లైన్ లో అమ్మేశాడు. తాను చేసిన నిర్వాకాన్నంతా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. దీనికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రేమ వికటిస్తే ద్వేషంగా మారుతుందంటారు, ఇదేనేమో కదా?

More Telugu News