: బీరు బాటిల్ @ 3,300 పౌండ్లు

మన మార్కెట్ లో బీరు బాటిల్ ధర ఎంతుంటుంది? వందో లేక రెండు వందలో ఉంటుంది. అయితే లండన్ లో ఓ బీరు 3,300 పౌండ్ల ధర పలికి బీరు ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లండన్ కు చెందిన 140 ఏళ్ల క్రితంనాటి బీరును వేలం వేశారు. దీని ధర 600 పౌండ్లు పలుకుతుందని వేలం నిర్వాహకులు భావించారు. వారిని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఇది 3,300 పౌండ్ల ధరకు అమ్ముడు పోయింది. ఊహించిన దాని కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఈ బీరును ఇంత ధర పోసి కొనడానికి కారణం పురాతనమైనది కావడమేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా, ఈ బీరును 1875లో సాహస యాత్రలో భాగంగా సర్ జార్జ్ నరేన్ అనే వ్యక్తి ఆల్ సావ్స్ ఆర్కెటిక్ అలె అనే ఈ బీరును తయారు చేశాడట. షోర్ప్ షైర్ లోని ఓ గార్బేజ్ లో బీరు బాటిల్ దొరికిందట. ఇంత వరకు 19 శతాబ్దపు ఖాళీ బీరు బాటిళ్లనే చూశామని, బీరుతో ఉన్న బాటిల్ ఇదేనని వేలం నిర్వాహకులు తెలిపారు.

More Telugu News