: మరుగుజ్జు గ్రహంపై మిస్టరీ... ఏంటో చెప్పలేకపోతున్న నాసా

యూఎస్ స్పేస్ ఏజన్సీ నాసా పంపిన 'డాన్' స్పేస్ క్రాఫ్ట్ మరుగుజ్జు గ్రహంగా చెప్పుకునే 'సిరెస్' ప్లానెట్ చిత్రాలను మరింత స్పష్టంగా తీసి పంపగా, వాటిల్లో కనిపిస్తున్న మిస్టరీ మచ్చలపై సైంటిస్టులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 'సిరెస్'కు 4,400 మైళ్ల దూరం నుంచి 'డాన్' చిత్రాలు తీసి పంపగా, వీటిపై తెల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. వీటి విస్తీర్ణం 90 కిలోమీటర్లు ఉండవచ్చని నాసా తన అధికార వెబ్ సైట్లో ప్రకటించింది. ఇప్పటివరకు సైంటిస్టులు ఇవి ఏంటన్న విషయం వెల్లడించలేకపోతున్నారని, ఇవి ఐస్ లేదా సాల్ట్ అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని తెలిపింది. సౌర వ్యవస్థలో ఓ గ్రహంపై ఇటువంటి తెల్ల మచ్చలు ఇప్పటివరకూ కనిపించలేదని డాన్ మిషన్ ఇన్వెస్టిగేటర్ క్రిస్ రసెల్ వ్యాఖ్యానించారు. ఆగస్టులో 'డాన్' స్పేస్ క్రాఫ్ట్ 'సిరెస్'కు 1,450 కి.మీ దూరానికి వెళ్లనుందని, అప్పుడు తీసే చిత్రాల్లో ఇంకాస్త స్పష్టత రావచ్చని ఆయన తెలిపారు.

More Telugu News