: మన దేశంలో 176 కొత్త జంతువుల గుర్తింపు

మన దేశంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 176 కొత్త జాతుల జంతువులను కనుగొన్నట్టు జీఎస్ఐ (జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) తెలిపింది. 176 కొత్త జంతువుల్లో ఉభయ చర జాతికి చెందిన జీవులు 24 రకాలు ఉండగా, చేపల జాతికి చెందినవి 23 రకాలు, సాలీడు పురుగు జాతికి చెందినవి 12 రకాలు, రెండు రకాల సరీసృపాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల్లో వీటిని కనుగొన్నట్టు తెలిపారు. ఈ జీవులన్నీ కూడా ఇంతవరకు వెలుగులోకి రాలేదని చెప్పారు.

More Telugu News