: భవిష్యత్తులో టెక్నాలజీ దుస్తులు అందించనున్న గూగుల్

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వస్త్రశ్రేణి వ్యాపారంలో ప్రవేశించనుంది. అయితే ఈ వస్త్రాలు సాధారణ వస్త్రాలకు భిన్నంగా స్మార్ట్ వస్త్రాలు కావడం విశేషం. ఈ మేరకు అమెరికాకు చెందిన లెవీ స్ట్రాస్ కంపెనీతో గూగుల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. జాక్వార్డ్ పేరిట చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ ఫోన్ వలె స్పర్శ, హావభావాల ఆధారంగా స్పందించే వస్త్రాలను తయారు చేయనుంది. ఈ వస్త్రాల్లో నూలుపోగులను గుండీల సైజులో ఉండే సర్క్యూట్లకు అనుసంధానించనున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ లోని సమాచారాన్ని ఈ వస్త్రాలతో పంచుకునే వెసులుబాటు కలగనుంది. సర్క్యూట్లు ఉన్నప్పటికీ స్ట్రెచ్డ్ జీన్స్ లా సాగడం, ఉతికే వెసులుబాటు ఉండడం ఈ వస్త్రాల ప్రత్యేకత. అంతే కాకుండా ఈ వస్త్రానికి స్పందించే గుణం ఉండడం విశేషం. ఈ వస్త్రాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో పలు సమస్యలకు పరిష్కారం దొరికినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News