: 3డీ సినిమాలు మెదడుకు పదును పెడతాయా?

3డీ సినిమాలు చూస్తే మేధస్సు పెరుగుతుందా? మనిషి మేధస్సుకు, 3డీ సినిమాలకు సంబంధం ఉందా? అదింకా పూర్తిస్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉంది. కానీ, మెదడు పనితీరు మెరుగుపరచడంలో 3డీ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రెయిన్ పవర్ మెరుగుపరచుకోవడానికి సులభమైన పద్ధతి 3డీ సినిమాలు చూడడం అని సలహాలు ఇస్తున్నారు. 3డీ సినిమా చూసిన తర్వాత మేధోవికాస సామర్థ్యం 23 శాతం మేర వృద్ధి చెందినట్టు ఓ సరికొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఇంగ్లండ్ లోని గోల్డ్ స్మిత్స్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్ట్ ప్యాట్రిక్ ఫాగన్ నాయకత్వంలోని ఓ బృందం 3డీ పరిజ్ఞానం, మెదడు అంశాలపై పరిశోధనలు నిర్వహించింది. 3డీ సినిమా చూసిన తరువాత ఊహాశక్తి, ఆలోచనలు, నైపుణ్యాలు, ప్రతిచర్యలు పెరుగుతాయని, తద్వారా ఉత్తేజం ఉప్పొంగుతుందని, అది మెదడుకు బూస్ట్ లా పనిచేస్తుందని వారు తెలిపారు. దీని వల్ల వృద్ధాప్యంలో కూడా జ్ఞాపకశక్తి కాపాడుకోవచ్చని, బాక్సర్లు, టెన్నిస్ క్రీడాకారులు మ్యాచ్లు ఆడే ముందు 3డీ సినిమాలు చూస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News