: ఇండియాలో మరో డేటా సెంటర్: ఐబీఎం

ప్రభుత్వంతో పాటు పలు సంస్థల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఇండియాలో మరో డేటా సెంటరును ప్రారంభించనున్నట్టు టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం వెల్లడించింది. తమకు సంబంధించిన సమాచారం దేశంలోని సర్వర్లలో మాత్రమే ఉండాలని ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు కోరుకుంటుండడంతో రెండో క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్టు ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వనితా నారాయణన్ వెల్లడించారు. ఎప్పటిలోగా డేటా సెంటరు ప్రారంభిస్తారు? పెట్టుబడి ఎంత? అన్న వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుత ఐబీఎం ముంబైలో ఒక డేటా సెంటరును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News