: జేబులో ఇమిడే కంప్యూటర్... ధర రూ.580 మాత్రమేనట!

వాకీటాకీల సైజులో ఉండే సెల్ ఫోన్లు పెన్నుల సైజుకు మారిపోయాయి. డబ్బాపెట్టలంత సైజులో ఎంట్రీ ఇచ్చిన కంప్యూటర్లు ఎల్సీడీ మానిటర్ల పుణ్యమాని చేతితో పట్టుకునేంత సైజుకు మారిపోయాయి. ఇక జేబులో పట్టేంత సైజులో కంప్యూటర్ల తయారీ ఒక్కటే మిగిలింది. అదే పనిలో ఉందిట, కాలిఫోర్నియాలో ‘చిప్’ పేరిట కొత్తగా విపణిలోకి వచ్చిన ఓ కంపెనీ. క్రెడిట్ కార్డు సైజులో ఉండే ఓ బుల్లి కంప్యూటర్ ను అభివృద్ధి చేసే పనిలో ఉందట చిప్ కంపెనీ. ధర కూడా సైజులానే అతి తక్కువేనని ఆ సంస్థ చెబుతోంది. తాము తయారు చేసే బుల్లి కంప్యూటర్ ను కేవలం 9 డాలర్ల (రూ.580)కే అందించనున్నట్లు చిప్ వెల్లడించింది. సైజు, ధర తక్కువైనా... పనితీరులో ఇతర కంప్యూటర్లకు తమ ఉత్పత్తి ఏమాత్రం తీసిపోదని చిప్ చెబుతోంది. 1 గిగా హెర్జ్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీతో పాటు బ్లూ టూత్, వై-ఫై సౌకర్యమూ ఇందులో వున్నాయట.

More Telugu News