: సాధారణ బూజుతో చవకగా జెట్ ఇంధనం

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరుగుతుండడం, భవిష్యత్తులో వాటి కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో, వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు బూజుతో జెట్ విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని తయారు చేయవచ్చని కనుగొన్నారు. సాధారణంగా ఎండుటాకుల్లోనూ, మట్టిలోనూ, కుళ్లిపోయిన ఫలాల్లోనూ కనిపించే మామూలు బూజుతో చవకగా ఇంధనం ఉత్పత్తి చేయవచ్చని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ బ్రిగెట్టీ ఆహ్రింగ్ తెలిపారు. ఇది విశ్వసనీయమైనదని పేర్కొన్నారు. తమ పరిశోధనలకు గాను ఆస్పర్ జిల్లస్ కార్బొనేరియస్ అనే బూజును ఎంపిక చేసుకున్నారు.ఆ బూజుకు ఓట్ మీల్ ను ఆహారంగా వేయగా, అది హైడ్రోకార్బన్ లను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోలియంలో ప్రధానంగా ఉండేది ఈ హైడ్రోకార్బన్లే. ఇవి విమాన ఇంధనంలోనూ ఉంటాయి. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఈ హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేయగలిగితే విమాన ఇంధన రంగంలో కొత్త శకం మొదలవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

More Telugu News