: గూగుల్ క్రోమ్ కు కొత్త ఫీచర్... హ్యాకర్ల బారి నుంచి కాపాడుతుందట!

గూగుల్ క్రోమ్ వినియోగదారులకు శుభవార్త! హ్యాకర్ల బారి నుంచి కాపాడే కొత్త ఎక్స్ టెన్షన్ ను గూగుల్ ప్రకటించింది. దీనిపేరు పాస్ వర్డ్ అలర్ట్. ఏదైనా ఫిషింగ్ పేజ్ పట్ల మీరు ఆకర్షితులై, అకౌంట్ వివరాలు నమోదు చేసే ముందు ఈ పాస్ వర్డ్ అలర్ట్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. అంటే, మీరు వివరాలు ఇస్తున్నది ఓ మోసపూరిత వెబ్ సైట్ కు అన్నమాట. పాస్ వర్డ్ లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే నకిలీ వెబ్ సైట్లు, హ్యాకర్లను ఇది గుర్తిస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ పాస్ వర్డ్ అలర్ట్ ఎక్స్ టెన్షన్ ను రూపొందించేందుకు మూడేళ్లు పట్టిందని దాని రూపకర్తల్లో ఒకరైన డ్రూ హింట్జ్ తెలిపారు.

More Telugu News