: సన్నగా పీలగా ఉన్నానని బాధపడుతున్నారా? ఇలా చేయండి లావవుతారు!

సాధారణంగా పిల్లలు సన్నగా ఉంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. వయసుకు తగ్గ బరువులేమని, బక్కగా, పీలగా ఉన్నామని కొందరు ఆందోళనలో మునిగిపోతారు. అలాంటి ఆందోళన అవసరం లేదని, 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు రోజుకు వెయ్యి కేలరీల శక్తి అవసరమవుతుందని, అలాగే 4 నుంచి 8 సంవత్సరాల మధ్యనున్న పిల్లలకు రోజుకు 1200 నుంచి 1400 కేలరీల శక్తి అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓ పౌండ్ బరువు పెరగాలంటే అదనంగా 3,500 కేలరీల ఆహారం తీసుకోవాలని వారు సూచించారు. రోజుకు 500 కేలరీల శక్తిగల అదనపు ఆహారం తీసుకోవడం ద్వారా వారంలో ఒక పౌండ్ బరువు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఆహారంలో కొవ్వు (ఆరోగ్యవంతమైన కొవ్వు) పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడితే బరువు పెరగడం పెద్దసమస్య కాదని వారు చెబుతున్నారు. పాస్తా, చీజ్, సాస్, డ్రైఫ్రూట్స్, యోగర్ట్, ఓట్ మీల్, గోధుమలు, పళ్ల రసాలు, స్మూతీస్, పాల పదార్థాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయని, అయితే ఇవి పరిమితులకు లోబడి తీసుకోవాలని సూచించారు. అతిగా తీసుకుంటే ఊబకాయం ప్రమాదముందని, బరువు పెరగగానే వీటికి దూరంగా ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News