: నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ కు మిలియన్ కు పైగా ఇమెయిల్స్

నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం)ని సమర్ధిస్తూ దేశంలోని నెటిజన్ల నుంచి 10 లక్షలకు (1006813) పైగా ఇమెయిల్స్ వచ్చినట్టు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. ఓ సామాజిక ప్రచారంపై దేశంలో ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో స్పందన రావడం ఎప్పుడూ చూడలేదని ట్రాయ్ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు తెలపాలంటూ మార్చి 27న ట్రాయ్ తన వెబ్ సైట్ లో ఓ కన్సల్టేషన్ పేపర్ ను ఉంచింది. దానికి అభిప్రాయాలు తెలిపేందుకు రేపటితోనే చివరిరోజు. ఇప్పటికీ పలువురు తమ అభిప్రాయాలను పంపుతూనే ఉన్నారు.

More Telugu News