: సెల్ ఫోన్లో చార్జింగ్ అయిపోయిందా?... "ఓం.. భీం.. బుష్" అనండి... చార్జింగ్ అవుతుంది!

సెల్ ఫోన్లో చార్జింగ్ అయిపోతే కంగారు పడకుండా 'ఓం.. భీం.. బుష్' అనో లేదా, 'ఛూ మంతర్... నా ఫోన్ చార్జింగ్ అయిపోవాలి' అనో అంటూ ఉంటే చాలు. కాసేపటికి మీ ఫోన్ చార్జింగ్ అవుతుంది. నిజమేనండీ, చుట్టుపక్కల శబ్దాలు, అరుపులను గ్రహించి, వైబ్రేట్ అవుతూ, తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే పోస్టల్ స్టాంప్ సైజు మైక్రోఫోన్‌ ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ ప్రయోగాన్ని జార్జియా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు విజయవంతం చేశారు. ఓ పలుచటి కాగితంపై రాగి పూత పూసి, మరోదానిపై టెఫ్లాన్ షీట్‌ ను పరిచి ఓ చివరలో రెండింటినీ అతికించగా, ధ్వని తరంగాలు రెండు షీట్లనూ వైబ్రేట్ అయ్యేలా చేశాయి. దీంతో ఈ రెండింటి మధ్యా తరంగాలు పుట్టి మొబైల్ చార్జింగ్ అయ్యేందుకు కావలసిన విద్యుత్‌ తయారైందని న్యూ సైంటిస్ట్ అనే మ్యాగజైన్ వెల్లడించింది. షీట్ సైజును బట్టి, మైక్రోఫోన్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని, స్కేర్ మీటర్‌కు సుమారుగా 121 మిల్లీవాట్స్ విద్యుత్ తయారవుతుందని వివరించింది.

More Telugu News