: నియాండర్తల్ మానవుడు నరమాంస భక్షకుడా?

నియాండర్తల్ మానవుడు నరమాంస భక్షకుడా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ఫ్రాన్స్ లోని బోర్డాక్స్ యూనివర్సిటీ పరిశోధకులు. నియాండర్తల్ మానవుడు పాముల్లా తన కడుపున పుట్టిన పిల్లల మృతదేహాలు భుజించేవాడని వారు చెబుతున్నారు. నియాండర్తల్ మానవుడి కాలం నాటి ఇద్దరు పెద్దలు, ఒక చిన్నపిల్లవాడి ఎముకలు పరిశీలించినప్పుడు ఇది బహిర్గతమైందని వారు తెలిపారు. నియాండర్తల్ మానవుడి ఎముకలు తీక్షణంగా పరిశీలించినప్పుడు, ఆ నాటి మనిషి తన సహచరుల ఎముకలు కొట్టడం, కోయడం, నుజ్జునుజ్జు చేయడం స్పష్టమైందని వారు వెల్లడించారు. క్రీస్తు పూర్వం ముఫ్ఫై వేల ఏళ్ల క్రితం నియాండర్తల్ మానవుడు అంతరించిన తరువాత, హోమోసేపియన్లు మనుగడలోకి వచ్చారని పరిశోధకులు తెలిపారు. హోమోసేపియన్లకి, ఆధునిక మానవుడికి దగ్గరి పోలికలు ఉన్నాయని వారు వెల్లడించారు. అలాగే, నియాండర్తల్, ఆధునిక మానవుడికీ డీఎన్ఏలో 0.12 శాతం తేడా ఉండడం విశేషం. కాగా, నియాండర్తల్ మానవుడు తన పిల్లలు, పెద్దలు మరణించిన కాసేపటికే వారిని భుజించి ఉంటాడని బోర్డాక్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియా డొలారెస్ గర్రాల్డా తెలిపారు.

More Telugu News