: రష్యన్ కు తల మార్పిడి...అరుదైన ప్రయోగానికి ప్రయత్నం

ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన శస్త్ర చికిత్సకు రంగం సిద్ధమవుతోంది. ఇంత వరకు గుండె, మూత్రపిండాలు, కాలేయం మార్పిడి శస్త్ర చికిత్సలు చూశాం. ఇకపై తల మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా చూసే అవకాశం కలగనుంది. రష్యాకు చెందిన స్పిరిడోమ్ (30) అనే రష్యన్ కంప్యూటర్ శాస్త్రవేత్త అరుదైన కండరాల జబ్బుతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన కాళ్లు, చేతులు చచ్చుబడిపోయి వీల్ ఛైర్ కే పరిమితమైపోయారు. ఇలా అవయవాలన్నీ చచ్చుబడిపోతూ మరణానికి చేరువవడమే తప్ప దీనికి పరిష్కారం లేదు. దీనికి పరిష్కారంగా బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి మొండాన్ని ఆయనకు అమర్చనున్నారు. అంటే తల మాత్రం రష్యన్ శాస్త్రవేత్తది, మిగతాదంతా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిది. ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసేందుకు ఇటలీ వైద్యుడు డాక్టర్ సెర్గీ కానెవరో ముందుకొచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో 36 గంటలపాటు జరగనున్న ఈ అరుదైన శస్త్ర చికిత్సలో 150 మంది డాక్టర్లు, నర్సులు పాలుపంచుకోనున్నారు.

More Telugu News