: ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీసు... అనుమతించిన అమెరికా కోర్టు

ఒకరితో ఒకరు కలిసేందుకు సహకరిస్తున్న సామాజిక మాధ్యమాలు ఇకపై విడిపోవడానికీ వారధిగా నిలవనున్నాయి. ఎక్కడున్నాడో తెలియకుండా కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే టచ్ లో ఉన్న భర్తకు విడాకుల నోటీసును ఫేస్ బుక్ మాధ్యమంగా పంపేందుకు అమెరికాలోని మాన్ హటన్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. యూఎస్ లో నుర్సుగా విధులు నిర్వహిస్తున్న ఎలనొరా అనే యువతి 2009లో విక్టర్ ను వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన విక్టర్, ఫేస్ బుక్ ద్వారా ఆమెతో అప్పుడప్పుడూ టచ్ లో ఉంటున్నాడు. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఎలనొరా నోటీసులు పంపేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతని చిరునామా దొరకలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా, ఫేస్ బుక్ ద్వారా విడాకుల నోటీసు పంపేందుకు న్యాయమూర్తి మథ్యూ కూపర్ అంగీకరించారు.

More Telugu News