: ఐక్యూలో ఈ బాలుడి ముందు ఐన్ స్టీన్ కూడా బలాదూరేనట!

ఇంగ్లండ్ లోని నార్త్ యార్క్ షైర్ కు చెందిన ఒవెన్ డన్ అనే 11 ఏళ్లు కూడా నిండని బాలుడిని చూస్తే... పిట్ట కొంచెం, కూత ఘనమన్న సామెత నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే, తెలివితేటల్లో అతడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ నే మించిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి ఆధునిక యుగంలో తెలివితేటలనూ కొలుస్తున్నాం. ఇందుకోసం ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషియంట్) పేరిట కొలమానం కూడా అందుబాటులోకి వచ్చింది. ఐన్ స్టీన్ కాలంలో ఈ కొలమానం అందుబాటులో లేకున్నా, ఆయన ఆవిష్కరణలను విశ్లేషించిన నేటి సైంటిస్ట్ లు ఆయన ఐక్యూను 160గా తేల్చేశారు. అయితే ఈ స్థాయిని ఒవెన్ డన్ దాటేశాడు. అతడి ఐక్యూ 162 గా తేలిందట. పాఠశాలలో అతడి అసాధారణ తెలివితేటలకు అచ్చెరువొందిన ఉపాధ్యాయులు అతడి ఐక్యూను కొలవమని మెన్సా సొసైటీని కోరారట. ఒవెన్ డన్ కు బ్రెయిన్ టెస్ట్ ను నిర్వహించిన సొసైటీ సిబ్బంది అతడి ఐక్యూ లెవెల్స్ చూసి నోరెళ్లబెట్టారు.

More Telugu News