: ట్రెడ్ మిల్ పై నడుస్తూ పనిచేస్తే పెర్ఫార్మెన్స్ పెరుగుతుందట

ట్రెడ్ మిల్ ఆరోగ్యం కాపాడడానికి ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. కానీ ట్రెడ్ మిల్ వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని కెనడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. ట్రెడ్ మిల్ పై నడుస్తూ పనిచేయడం వల్ల వర్క్ పెర్ఫార్మెన్స్ మెరుగవుతుందని వారు తెలిపారు. రెగ్యులర్ గా ట్రెడ్ మిల్ పై పనిచేయడం కారణంగా ఏకాగ్రత పెరుగుతుందని, ఫలితంగా వర్క్ లో గ్రోత్ ఉంటుందని వెల్లడించారు. ట్రెడ్ మిల్ పై నడుస్తూ సిస్టమ్ బ్రౌజ్ చేసుకోవచ్చని, మెయిల్స్ చెక్ చేసుకోవచ్చని, రైటింగ్, రీడింగ్ వంటివి చేయవచ్చని వారు సూచిస్తున్నారు. 40 నిమిషాలు ట్రెడ్ మిల్ ని వినియోగిస్తే, 2.25 కిలోమీటర్లు నడిచినట్టు చూపిస్తుందని దీనివల్ల ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని వారు చెబుతున్నారు.

More Telugu News