: మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయాణం ఆరు నెలలు పొడిగింపు

అంగారక గ్రహంపై మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయాణాన్ని ఇస్రో మరో ఆరు నెలల పాటు పొడిగించింది. అరుణ గ్రహంపై మరింత అన్వేషణ, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకేనని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "ఇంతకు ముందు ఉద్దేశించిన దానికంటే 1,340 కేజీల మార్స్ ఆర్బిటర్ కు తగినంత ఇంధనం ఉంది. అందుకే దాని లక్ష్యం మరొక ఆరు నెలల పాటు పొడిగించాం" అని చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన మామ్ నేటికి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. దాంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

More Telugu News