: గజరాజులే త్వరగా నేర్చుకుంటాయట!

శునకాల కన్నా ఏనుగులే మేలంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. అవి ఏం చెప్పినా త్వరగా అర్థం చేసుకుంటాయట. ఈ విషయంలో అవి కుక్కలను కూడా అధిగమించాయని వారి అధ్యయనంలో తేలిందట. ఆఫ్రికా, అమెరికాలోని పలు మిలిటరీ క్యాంపుల్లో తాము ప్రయోగాత్మకంగా ఈ విషయాన్ని నిరూపించామని పరిశోధకులు తెలిపారు. బాంబులను గుర్తించే క్రమంలో జాగిలాల కంటే గజరాజులే వేగంగా వాసన పసిగట్టాయని వివరించారు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో వాటి సామర్థ్యం అమోఘమని కితాబిచ్చారు. శిక్షణ సందర్భంగా నేర్పే విషయాలను చక్కగా గుర్తుంచుకుంటాయని తెలిపారు. తాజా పరిశోధన నేపథ్యంలో, పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఇకపై కుక్కలకు బదులు ఏనుగులను పట్టుకుని తిరుగుతారేమో చూడాలి!

More Telugu News