: ట్విట్టర్ కు తొమ్మిదేళ్లు నిండాయి... ట్విట్టర్ ఫాలోయింగ్ లో పాప్ గాయని కేటీదే అగ్రస్థానం!

సోషల్ మీడియాలో పెను సంచలనాలకు నాంది పలికిన ట్విట్టర్ కు నేటితో తొమ్మిదేళ్లు నిండాయి. 2006 మార్చి 21న 'జస్ట్ సెట్టింగ్ ట్విట్'తో ప్రారంభమైన ట్విట్టర్ నేటి ఆధునిక ప్రపంచంలో ప్రధాన సమాచార సారధిగా వెలుగొందుతోంది. జాక్ డోర్సీ, ఎవాల్ విలియమ్స్, బిజ్ స్టోన్, నోవా స్టోన్స్ అనే నలుగురు వ్యక్తులు ట్విట్టర్ కు జీవం పోశారు. ప్రస్తుతం 280 కోట్ల మంది ట్విట్టర్ లో యాక్టివ్ మెంబర్లుగా ఉన్నారు. వీరంతా ప్రతిరోజు 50 కోట్ల ట్వీట్లను పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ ఫాలోయింగ్ లో అమెరికాకు చెందిన పాప్ గాయని కేటీ పెర్రీ ప్రథమ స్థానంలో ఉంది. ఆమెను 6.69 కోట్ల మంది ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, తనదైన శైలిలో సమాచార సంబంధాలను కొనసాగిస్తున్నారు.

More Telugu News