: అత్యంత వేగంగా పరిగెత్తే రోబో 'ఏట్రియాస్'ను అభివృద్ధి చేసిన అమెరికా

రెండుకాళ్లతో అత్యంత వేగంగా పరిగెత్తే రోబోను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు 'ఏట్రియాస్'. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని రోబోలకన్నా ఇది వేగంగా పరిగెత్తగలదని దీన్ని తయారుచేసిన ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ కళాశాల నిపుణులు తెలిపారు. ఏదైనా దుర్ఘటన జరిగిన ప్రాంతంలోకి సహాయక సిబ్బంది వెళ్లటం సాధ్యం కానప్పుడు ఈ రోబోను పంపించి చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. రెండు కాళ్లతో వేగంగా దూసుకెళ్లే పక్షుల శరీరనిర్మాణం ఆధారంగా దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఏట్రియాస్ కాళ్లను కార్బన్ ఫైబర్‌ తో తయారుచేశామని, ఎగుడుదిగుళ్లు, అవరోధాలు ఉన్నా పరుగు ఆపబోదని వివరించారు.

More Telugu News