: నాకు కొన్ని వందల ఏళ్ల పాటు జీవించాలని వుంది!: గూగుల్ వెంచర్స్ అధ్యక్షుడు

తనకు వందేళ్లలోపు మరణించాలని లేదని గూగుల్ వెంచర్స్ అధ్యక్షుడు బిల్ మారిస్ తెలిపారు. బ్లూమ్ బెర్గ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కొన్ని వందల ఏళ్లు జీవించాలని ఆశిస్తున్నానని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, జన్యు పరిశోధనలు, క్యాన్సర్ పరిశోధన సంస్థలపై గూగుల్ వెంచర్స్ భారీ పెట్టుబడులు పెట్టిందని తెలిపిన ఆయన, మానవుల ప్రామాణిక జీవితకాలాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ పదేళ్ల కాలంలో బ్రిటన్ లో జీవిత కాలం ఐదేళ్లు పెరిగిందని, భవిష్యత్ లో ఇది 500 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. గూగుల్ సంస్థ, ఆపిల్ కొలాబరేషన్ తో చేపట్టిన కాలికో ప్రాజెక్టు గురించి వివరించారు. కాలికో ప్రాజెక్టు వృద్ధాప్యంపై, దాని కారణంగా వచ్చే వ్యాధులపై పరిశోధనలకు ఉద్దేశించినదని వివరించారు.

More Telugu News