: మీకు విశ్లేషణా నైపుణ్యం ఉందా?...అయితే, యూ ఆర్ సెలెక్టెడ్!

పలు విషయాలపై మీకు అవగాహన ఉందా? మీరు చెప్పాలనుకున్న విషయాన్ని సోది లేకుండా అవతలి వారికి అర్థమయ్యే రీతిలో సూటిగా చెప్పగలరా? దీనికి తోడు మీ గొంతు బాగుంటుందా? అయితే, రెజ్యూమ్ విషయం కాస్త పక్కన పెట్టండి. అదేం పెద్ద విషయం కాదు. మీకు బాగా మాట్లాడే నైపుణ్యం ఉంటే అదే మీకు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగం ఇవ్వదలుచుకున్నవారు మీరు ఎంతటి విషయ సంపాదన కలిగి ఉన్నవారనే విషయంతో పాటు, పోటీ ప్రపంచంలో మీకున్న సమర్థతను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, మరో విషయంపై ప్రత్యేక దృష్టి పెడతారట. ఇతరులు చెప్పే విషయాలు ఎంత శ్రద్ధగా వింటున్నారనేదే కాకుండా, ఎదుటివారికి ఎంత చక్కగా చెబుతున్నారనే విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటారట.

More Telugu News