: ఫోన్ మాట్లాడడం వల్ల మెడపై 18 కేజీల బరువు పడుతోందట...!

ఏదో ఒక పని చేస్తూ మొబైల్ మాట్లాడడం ఫ్యాషన్ గా మారింది. బైక్ నడుపుతూ కొందరు, ఇంట్లో పనులు చేసుకుంటూ కొందరు మెడకు, భుజానికి మధ్య ఫోన్ పెట్టేసి మెడను ఓ పక్కకి వంచుతూ ఫోన్లు మాట్లాడడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇది సరికాదని డాక్టర్ కెన్నెత్ హంసరాజ్ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. తన పరిశోధన ఫలితాలను సర్జికల్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ అనే జర్నల్ లో ప్రచురించారు. అందులోని విశేషాలు...సాధారణంగా ప్రతి వ్యక్తి తల బరువు 4.5 నుంచి 5.5 కేజీల బరువు తూగుతుంది. మొబైల్ ఫోన్ ను చేతుల్లో పట్టుకుని తలను 30 డిగ్రీల కోణంలో పక్కకి వంచడం వల్ల మెడభాగంలోని వెన్నుపూసలపై 18 కేజీల బరువు పడుతుందని పేర్కొన్నారు. అదే తలను 45 డిగ్రీల కోణంలో వంచితే వెన్నుపూసలపై 22 కేజీల బరువు పడుతుందని వెల్లడించారు. తలను ఎంత వంచితే అంత ఎక్కువ బరువు మెడపై పడుతుందని, దీని వల్ల వెన్నుపూసలు అరిగిపోతాయని పరిశోధనలో తెలిపారు. స్మార్ట్ ఫోన్ కానీ, టచ్ స్క్రీన్ లు ఉపయోగించే సమయంలో కానీ చేతులకు మంచి సపోర్ట్ లభించేలా టేబుల్ వంటి ఎత్తైన బల్లకు ఆనించి, తల, మొబైల్ సరిగి ఉడేలా చూసే పోశ్చర్ అనుసరిస్తే వెన్ను అరుగుదల నివారించవచ్చని పరిశోధన తెలిపింది.

More Telugu News