: చంద్రుడ్నీ వదలడం లేదు...కాదేదీ వ్యాపారానికి అనర్హం!

అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ పేర్కొన్నట్టు, కాదేదే వ్యాపారానికి అనర్హం అంటూ చంద్రుడిపైకి ఎగబాకుతున్నారు కొందరు పారిశ్రామిక వేత్తలు. దీంతో ఆహ్లాదంగా అందరినీ అలరించే చందమామ గురించిన కొన్ని సరికొత్త విషయాలను నిపుణులు వెల్లడించారు. చంద్రుడిపై అత్యంత విలువైన ఖనిజ సంపద వుందని పేర్కొన్నారు. చంద్రుడి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద భారీ మంచు నీటిని ఓ అంతరిక్ష నౌక గుర్తించిందని తెలిపారు. అక్కడ మంచు లేదా చమురు ఏదైనా ఉండవచ్చని రిచర్డ్ కోర్ ఫీల్డ్ అనే సైన్స్ రచయిత తన వ్యాసంలో పేర్కొన్నాడు. చంద్రుడిపై ఉన్న మంచు నీటిని రాకెట్ ప్రొపెల్లెంట్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ గా మార్చి తక్కువ ధరకే ఇంధనాన్ని అందుబాటులో తీసుకురావచ్చని టెక్సాస్ లోని షెకెల్టన్ ఎనర్జీ కంపెనీ యోచిస్తోంది. అంతరిక్షంలో గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే రాకెట్లకు ఇంధనాన్ని అందించవచ్చని ఈ సంస్థ సీఈవో డేల్ టైటిజ్ తెలిపారు.

More Telugu News