: అక్కడ ‘మలం’ కూడా విలువైనదేనట... దానమిస్తే డబ్బిస్తారట!

రక్త దానం చూశాం. అవయవ దానం విన్నాం. ఆఖరుకు గర్భదానం, వీర్యదానం కూడా తెలుసు. మరి ఈ ‘మల దానం' ఏమిటి, అసహ్యంగా అనే కదా మీ డౌటు? మన వద్ద మీరు ఈసడించుకునే ఈ దానం లేదు కానీ, అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలే మొదలైంది. ఆ దేశానికి చెందిన ‘ఓపెన్ బయోమ్’ అనే సంస్థ ఇటీవలే... ‘‘మలాన్ని దానంగా ఇవ్వండి, డబ్బిస్తాం’’ అంటూ ప్రచారం మొదలెట్టింది. డబ్బంటే... ఏ పదో, పరకో కాదు... ఏకంగా వేల రూపాయల చొప్పున చెల్లిస్తుందట. ఒకసారి మలం ఇస్తే రూ.2,500 ఇస్తానని సదరు సంస్థ ప్రకటించింది. వారానికి ఐదుసార్లు ఇస్తే, ఇచ్చిన ప్రతిసారీ రూ.3 వేల చొప్పున ముట్టజెబుతుందట. అయినా మలంతో ఆ సంస్థ ఏం చేస్తుందనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. మలంలోని మైక్రో బయోటా సాయంతో క్లాడియం డిఫికైల్ (సీడీ) ద్వారా వచ్చే ఇన్ ఫెక్షన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆ సంస్థ చెబుతోంది. అదీ సంగతి!

More Telugu News