: లీటరు పెట్రోల్ తో 200 కిలోమీటర్లు... భారత విద్యార్థుల ఘనత

కేరళ రాజధాని తిరువనంతపురంలోని గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ అద్భుత వాహనానికి రూపకల్పన చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, లీటర్ పెట్రోల్ తో 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. చమురు ధరలు పెరిగిపోతుండడం, అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదో అద్భుతమైన ఆవిష్కరణ అని కళాశాల ప్రిన్సిపాల్ బి.అనిల్ పేర్కొన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ 6వ సెమిస్టర్ చదువుతున్న బిబిన్ సాగరమ్, రోనిత్ స్టాన్లీ, విష్ణుప్రసాద్ అనే ముగ్గురు విద్యార్థులు ఈ ప్రొటోటైప్ వాహనాన్ని డిజైన్ చేశారు. ఇందులో హోండా జీఎక్స్ 35 ఇంజిన్ ను ఉపయోగించారు. ఇతర భాగాలను తక్కువ బరువుండే పదార్థాలతో రూపొందించారు. మెరుగైన మైలేజి ఇచ్చేందుకు వీలుగా అడ్వాన్స్డ్ ఏరోడైనమిక్ టెక్నాలజీ వినియోగించడం విశేషం. వీరు రూపొందించిన ఈ హైబ్రిడ్ వాహనం అంతర్జాతీయ ఇంధన సమర్థత పోటీకి ఎంపికైంది. ఫిలిప్పీన్స్ వేదికగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ కాంపిటీషన్ జరుగుతుంది. అన్నింటిలోకి మెరుగైన ఆవిష్కరణకు అందులో బహుమతి ఇస్తారు.

More Telugu News