: మలేరియా క్రిమి గుట్టు తెలిసింది... టీకా తయారు దిశగా భారత్ ముందడుగు!

ఎన్నో దశాబ్దాలుగా అంతుచిక్కకుండా శాస్త్రవేత్తలను వేధిస్తున్న మలేరియా వ్యాధికారక క్రిమి గుట్టు తెలుసుకోవడంలో భారతీయ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఢిల్లీకి చెందిన జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీలోని శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త పరమాణువును కనుగొన్నారు. భవిష్యత్తులో ఈ పరమాణువే మలేరియాకు వ్యాక్సిన్‌ లా మారనున్నదని వారు నమ్ముతున్నారు. వీరి పరిశోధన ఫలితాలను అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్‌ ప్రచురించగా, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరిశోధన ఆధారంగా టీకాను తయారు చేసేందుకు పదేళ్లు పట్టవచ్చని తెలుస్తోంది. ప్రతిఏటా భారత్‌లో పది లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది మలేరియా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News