: కేన్సర్ కు చికిత్స మరింత సులువు... 10 కొత్త యాంటీబాడీలను కనుగొన్న శాస్త్రవేత్తలు

ఏటా కోట్లాది మందిని మృత్యువుకు దగ్గర చేస్తున్న కేన్సర్ కు మరింత సులువుగా చికిత్స పొందే వీలు కలుగనుంది. డెన్మార్క్ లోని ఆర్హుస్ యూనివర్సిటీ రీసెర్చర్లు తాజాగా కేన్సర్ కు వ్యతిరేకంగా మరింత సమర్థవంతంగా పోరాడగల 10 కొత్త యాంటీబాడీలను కనుగొన్నట్టు ప్రకటించారు. ఇవి రక్తనాళాల ద్వారా కేన్సర్ కణితి వద్దకు చేరుకొని కణితికి ఆక్సిజన్ తదితర పోషకాలను అందకుండా చేస్తాయని వారు తెలిపారు. ఓ చుంచు ఎలుకపై ప్రయోగశాలలో తాము చేసిన ప్రయోగం విజయవంతం అయిందని వివరించారు. కణితులను పెరగనీయకుండా ఈ యాంటీబాడీలు పనిచేశాయని తెలిపారు. తమ ప్రయోగంలో భాగంగా కేన్సర్ కణితి పెరగకుండా చేయగలిగినట్టు వర్శిటీ ప్రొఫెసర్ పీటర్ క్రిస్టీన్ సేన్ పేర్కొన్నారు.

More Telugu News