: అంతరిక్షంలో 'భూత కణం', ఏలియన్స్ వున్నారు... తాజా సాక్ష్యాలు విడుదల చేసిన శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో ఒక విచిత్ర 'భూత కణం' కనుగొన్నామని, దీంతో ఎక్కడో ఒకచోట జీవం ఉందన్న విషయాన్ని మరోసారి నిర్ధారించుకున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. బకింగ్ హాం వర్శిటీ, యూనివర్సిటీ అఫ్ షఫీల్డ్ కు చెందిన రీసెర్చర్లు చేసిన పరిశోధనల్లో మైక్రోస్కోపిక్ ఏలియన్ ఆర్గాన్ లను ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకువెళ్ళే 'లివింగ్ బెలూన్' కనుగొన్నారు. ఇది కేవలం మానవ వెంట్రుకంత మందంతో వుందని, భూ వాతావరణానికి 27 కిలోమీటర్ల దూరంలో ధూళికణాల మధ్య కనపడుతూ, మాయమవుతూ వుందని వివరించారు. కార్బన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనంగా వుందని రీసెర్చర్లు తెలిపారు. ఇటువంటిది భూమిపై ఇప్పటివరకూ కనిపించలేదని వివరించారు. తమ పరిశోధనల తరువాత అంతరిక్షంలో జీవం ఉందనడానికి మరింత సాక్ష్యం లభించినట్లయిందని పేర్కొన్నారు.

More Telugu News