: క్విక్ ఫైర్ నెట్ వర్క్స్ కొనుగోలు చేసిన ఫేస్ బుక్

పోటీకి వస్తాయనుకున్న, లేక తమకు ఉపయోగపడతాయనుకున్న సంస్థలను కొనుగోలు, లేక విలీనం చేసుకోవడంలో ఫేస్ బుక్ దూకుడు ప్రదర్శిస్తోంది. వ్యాపార సూత్రాలు బాగానే వంటబట్టించుకున్న మార్క్ జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ ను సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. తాజాగా తక్కువ ఎంబీలో వీడియోను నిక్షిప్తం చేసి ఎక్కువ రిజల్యూషన్ తో చూపించే క్విక్ ఫైర్ నెట్ వర్క్స్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. అయితే దాని కొనుగోలుకు ఎంత ఖర్చైంది అన్న విషయం తెలియచేయనప్పటికీ, తాము ఆ సంస్థను కొనుగోలు చేసినట్టు మాత్రం బ్లాగ్ లో పేర్కొంది. దీంతో ఫేస్ బుక్ లో వాట్సప్ వంటి యాప్ ల సరసన క్విక్ ఫైర్ నెట్ వర్క్స్ కూడా చేరింది. 2014 జూన్ లో మొదలైన ఈ సంస్థ సాఫ్ట్ వేర్ ద్వారా రోజుకు సరాసరి ఒక బిలియన్ వీడియోలను నెటిజన్లు చూస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్ పెరగడంతో ఫేస్ బుక్ కొనుగోలు చేసింది.

More Telugu News