: ఫోర్ జీబీ ర్యాం, ఆప్టికల్ జూమ్ తో ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్ ఫోన్

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2015 మరిన్ని కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసుస్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా 4 జీబీ ర్యాం, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ సదుపాయాలున్న స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. జెన్ ఫోన్, జెన్ ఫోన్-2 పేరిట మార్చి తరువాత మార్కెట్లోకి విడుదలయ్యే వీటి ధర 199 నుంచి 399 డాలర్ల మధ్య (సుమారు రూ.12,600 నుంచి రూ.25,300) ఉంటుందని సంస్థ తెలిపింది. వీటి స్టోరేజ్ సామర్థ్యాన్ని 64 జీబీ వరకూ పెంచుకోవచ్చని పేర్కొంది. 4 జీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3000 ఎంఏహెచ్ బ్యాటరీ జెన్ ఫోన్-2కు అదనపు ఆకర్షణ అని ఆసుస్ తెలిపింది.

More Telugu News