: వేదాల కాలంలోనే భారతావనిలో ఆకాశయానం... సైన్స్ కాంగ్రెస్ లో శాస్త్రవేత్తలు

భారతావనిలో వేదాలు విలసిల్లిన కాలంలోనే విమానాలను కనుగొన్నారని ముంబైలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో శాస్త్రవేత్త కెప్టెన్ ఆనంద్ బోదాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ కాలంలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి కూడా ప్రయాణాలు జరిగాయని, మార్గ మధ్యంలో ఒక చోట స్థిరంగా ఆగి అక్కడి నుంచి ఎటు వైపు కావాలంటే అటు వైపు వెళ్లేంతటి సాంకేతికత ఉండేదని ఆయన అన్నారు. 'పురాతన భారత విమానయాన సాంకేతికత' అంశంపై ఆయన ప్రసంగిస్తూ, "ఇక్కడ అధికార, అనధికార చరిత్రలు ఉన్నాయి. 1903 లో రైట్ సోదరులు తొలి విమానాన్ని నడిపారని అధికారిక చరిత్ర చెబుతోంది. పురాతన భారత గ్రంధాల ప్రకారం 'వైమానిక ప్రకరణం' ఉంది. అయితే కాలం గడిచేకొద్దీ ఆ సిద్ధాంతాలను మరచిపోయాం" అని బోదాస్ తెలిపారు. 102 సంవత్సరాల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో 'సంస్కృతి నుంచి పురాతన వైజ్ఞానికత' పేరిట చర్చలు జరగటం ఇదే తొలిసారి. కాగా, పురాణాలు ఇమిడి ఉన్న ఇలాంటి చర్చలు ప్రజలను తప్పుదారి పట్టిస్తాయని నాసా శాస్త్రవేత్తలు ఓ ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News