: బుడతల కోసం స్మార్ట్ కార్... ధర జస్ట్ రూ.63 వేలే!

చిన్నారులు ఎంతో సులభంగా డ్రైవింగ్ చేసేలా ‘బ్రూన్ ఎఫ్8' పేరిట ఒక సూపర్ స్మార్ట్ కారును కొరియా సంస్థ ఒకటి తయారుచేసింది. అంతేకాదు, పెద్దలు తమ వేలి కొనలపై దీనిని నియంత్రించవచ్చు. అంతలా మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌ లలో నడిచే కారును ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్లెట్ తో నియంత్రించొచ్చు. గంటకు 14 కిలోమీటర్ల వరకూ వేగంతో వెళ్ళే ఈ చిన్నకారులో కుదుపులు నివారించేందుకు గ్యాస్ సస్పెన్షన్ వ్యవస్థ, స్మార్ట్ టచ్‌ స్క్రీన్ పవర్ కంట్రోల్, చిన్నారులకు మరింత భద్రతనిచ్చేలా బకెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేకులు తదితర సదుపాయాలున్నాయి. 12 వోల్టులు/24 వోల్టుల బ్యాటరీ సహాయంతో పనిచేసే 15,000 ఆర్పీఎం మోటారుతో పరుగులు పెట్టే కారు ఖరీదు 1000 డాలర్లని (సుమారు రూ. 63 వేలు) తయారీ సంస్థ తెలిపింది.

More Telugu News