ట్విట్టర్లో నటి అంజలి ద్వివేది నగ్న ఫొటోల కలకలం

04-08-2014 Mon 17:33

దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన అంజలి ద్వివేది నగ్నఫొటోలు ట్విట్టర్లో కలకలం సృష్టించాయి. ఆమె పేరిట ట్విట్టర్లో ఓ నకిలీ ఖాతా తెరిచి ద్వివేది న్యూడ్ ఫొటోలను అందులో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈ హీరోయిన్ ట్విట్టర్లో తన ఫొటోలను చూసుకుని షాక్ కు గురైంది. మిత్రులు ఆమెకు ఈ అశ్లీల ఫొటోల విషయం తెలిపారు. దీనిపై ద్వివేది ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరాల చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనంతరం ఆ నకిలీ అకౌంట్ ను బ్లాక్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఇంతకుముందు కూడా ఓసారి ద్వివేది నగ్న ఫొటోలంటూ కొన్నింటిని ఫేస్ బుక్ లో పెట్టారు.