: అవినీతిలో కేజీహెచ్ నెంబర్ వన్: వైద్య, ఆరోగ్య మంత్రి

ప్రతిష్ఠాత్మక కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)పై ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో కేజీహెచ్ ను తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవినీతిలో కేజీహెచ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ‘ప్రభుత్వ వైద్యం ఇక్కడ బాగుంది’ అని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఎక్కడా లేదని ఆయన మండిపడ్డారు. అన్ని సౌకర్యాలూ కల్పించినా సిబ్బంది తీరు కారణంగా ప్రభుత్వ వైద్యం నాసిరకంగా తయారవుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యంపై నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఆసుపత్రిలోని సిబ్బంది, వైద్యులదేనని ఆయన స్పష్టం చేశారు. పరిమిత వనరులతో ప్రైవేటు వైద్యశాలలు ప్రతిష్ఠ పెంచుకుంటుండగా, అన్ని వనరులు అందుబాటులో ఉన్న ప్రభుత్వాసుపత్రులు మాత్రం దారుణంగా వ్యవహరిస్తూ అప్రతిష్ఠ మూటగట్టుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో విమ్స్ తొలి దశ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కామినేని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా సహకరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News