పశుపతినాథ్ ఆలయానికి రూ. 25 కోట్లు కేటాయింపు: ప్రధాని

04-08-2014 Mon 16:38

ఖాట్మండులోని పశుపతి నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ ఉదయం కాషాయ వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ సంరక్షణ కోసం రూ.25 కోట్లు కేటాయిస్తానని ఆయన చెప్పారు. అలాగే, ఆ ఆలయానికి భారత్ నుంచి 2500 కిలోల ఎర్రచందనాన్ని పంపిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.