నా తప్పుంటే ఉరి తీయండి: మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి

04-08-2014 Mon 16:20

ఓ మహిళా అదనపు జడ్జిని వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి తాను తప్పు చేసినట్టు రుజువైతే ఉరిశిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఆయన నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తనపై ఆరోపణలన్నీ అవాస్తవాలని వివరించారు. కాగా, తనను ఓ ఐటం సాంగుకు డ్యాన్స్ చేయాలని సదరు హైకోర్టు న్యాయమూర్తి కోరినట్టు ఆ మహిళా జడ్జి రాష్ట్రపతి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై విచారణ జరపాలంటూ కొందరు మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ లో తీర్మానం ప్రవేశపెట్టారు.