రెండు వారాల్లోనే 313 కోట్ల రూపాయలు వసూలు చేసి 'కిక్' ఇచ్చిన సల్మాన్

04-08-2014 Mon 15:58

బాలీవుడ్ సినీ పరిశ్రమకు సల్మాన్ ఖాన్ మంచి 'కిక్' ఇచ్చాడు. తొలి రెండు వారాల్లో 313 కోట్ల రూపాయలు వసూలు చేసి 'కిక్' రికార్డుల దిశగా దూసుకుపోతోంది. గతంలో అత్యుత్తమ కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాలు 'జబ్ తక్ హై జాన్', 'దబాంగ్ 2' సాధించిన వసూళ్లను సల్మాన్ 'కిక్' దాటేసింది. కేవలం భారతదేశంలోనే 'కిక్' సినిమా 197.70 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. 5000 తెరలపై ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తొలి సినిమాగా, ఇంతవరకు బాలీవుడ్ సినిమాలు విడుదల చేయని దేశాల్లో కూడా విడుదలైన సినిమాగా 'కిక్' రికార్డులు సొంతం చేసుకుంది.