భీమవరం వాసుల అభిమానానికి ముగ్ధురాలైన నటి కాజల్

04-08-2014 Mon 15:51

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసుల అభిమానానికి అందాల భామ కాజల్ అగర్వాల్ ముగ్ధురాలైంది. తనకు ఇక్కడ అంతమంది అభిమానులున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఇక్కడ ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ ను చూసేందుకు, చేతులు కలిపేందుకు స్థానికులు తెగ ఉత్సాహం చూపించారు. ఆమె తన కారు దిగి వస్తుండగా 'మిత్రవిందా' అంటూ పెద్దగా అరిచారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన కాజల్, త్వరలో భీమవరంలోనే చేయనున్న షూటింగ్ లో తాను పాల్గొనబోతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తాను హిందీలో ఓ చిత్రం చేస్తున్నానని, త్వరలో ఓ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపింది.