ప్రధాని మోడీ జపాన్ పర్యటన ఖరారు

04-08-2014 Mon 15:38

సెప్టెంబరులో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళుతున్నట్లు ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. ప్రధాని జపాన్ పర్యటన ఖరారు అయిందని, సెప్టెంబరు 2వ తేదీన మోడీ జపాన్ వెళతారని పీఎంవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరులో మోడీ అమెరికాలో కూడా పర్యటించనున్నారు. కాగా, ప్రస్తుతం ప్రధాన మంత్రి నేపాల్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.