భూకంప బాధితుల కోసం మూడు మైళ్ళు నడిచిన చైనా ప్రధాని!

04-08-2014 Mon 14:55

చైనాలో ఆదివారం నాడు సంభవించిన భూకంపం ధాటికి 300 మందికి పైగా మృత్యువాత పడడం తెలిసిందే. యున్నాన్ పర్వతశ్రేణిలోని లుదియాన్ కౌంటీలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదైంది. లాంగ్టౌషాన్ ప్రాంతాన్ని ఈ భూకంపానికి కేంద్రంగా గుర్తించారు. కాగా, ప్రకృతి విలయంతో అతలాకుతలమైన ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన చైనా ప్రధాని లీ కెకియాంగ్ మూడు మైళ్ళు నడిచారు. ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయన నడకదారి ఎంచుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను కెకియాంగ్ పర్యవేక్షించారు.