వందకోట్లతో అమెరికా గడ్డపై హిందూ దేవాలయం

04-08-2014 Mon 14:31

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ హిందూ దేవాలయాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. వచ్చే వారం ఈ ఆలయ సముదాయం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. దీని నిర్మాణానికి రూ.110 కోట్లు ఖర్చయ్యాయి. ఈ దేవాలయం పూర్తిగా ఇటాలియన్ మార్బుల్స్ తో రూపుదిద్దుకుంది. బొకాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆధ్వర్యంలో ఈ గుడి కట్టారు. ఇందులో 108 స్థంభాలు, మూడు గర్భ గుడులు ఉంటాయి.ఈ ఆలయాన్ని పురాతన శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించారు. కాగా, ప్రారంభోత్సవం సందర్భంగా వేద యజ్ఞం, భక్తుల శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆగస్టు 9, 10న జరుపుకునే ప్రారంభోవత్సవ వేడుకల అనంతరం ఆగస్టు 16న భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు.