శ్రీలంక వెబ్ సైట్ లో జయలలితపై కథనాన్ని ఖండిస్తున్నా: వెంకయ్యనాయుడు

04-08-2014 Mon 13:11

శ్రీలంక రక్షణశాఖ వెబ్ సైట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలకు ముడిపెడుతూ పెట్టిన ఫొటోలు, కథనంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఆ అభ్యంతరకర కథనాన్ని ఖండిస్తున్నానని అన్నారు. అంతకుముందు ఈ విషయంపై లోక్ సభ, రాజ్యసభలో ఏఐడీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాంతో, లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.