బీమా బిల్లుపై కేంద్ర చర్చలు విఫలం

04-08-2014 Mon 13:01

బీమా చట్ట సవరణ బిల్లుపై విపక్షాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. దీనిపై ఏకాభిప్రాయం కోసం విపక్షాలతో ఈరోజు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, అఖిలపక్ష సమావేశం అసంపూర్తిగా ముగిసిందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. రెండురోజుల్లో ఈ అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశం జరుగుతుందని చెప్పారు. కాగా, ఈ బిల్లును కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తారా? ఆమోదిస్తారా? లేక చట్టాన్ని సవరించాలంటారో రాజ్యసభలో చెప్పాలని ఆర్థిక మంత్రి జైట్లీ భేటీలో స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేగాక బిల్లుపై కాంగ్రెస్ వేచిచూసే ధోరణిని, కాలయాపన చేయడాన్ని ఎన్డీఏ ఒప్పుకోదని కూడా తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.