శ్రీలంకకు వ్యతిరేకంగా తమిళ చిత్రసీమ ధర్నా

04-08-2014 Mon 11:34

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాస్తున్న లేఖలకు విపరీతార్థాలు వచ్చేలా శ్రీలంక రక్షణ శాఖ వెబ్ సైట్ లో ఫొటోలు, వ్యాఖ్యలు పెట్టడంపై తమిళ చిత్ర పరిశ్రమ ధర్నాకు దిగింది. ఈ మేరకు చెన్నైలోని లంక కాన్సులేట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. అటు ఈ వ్యవహారంపై రెండు రోజుల కిందట జయలలిత ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే లంక రక్షణ శాఖ బేషరతు క్షమాపణ చెప్పింది. తమ వెబ్ సైట్ లో పెట్టిన ఫొటోలు, వ్యాఖ్యలను తొలగించింది.